కొత్త వేరియంట్‌ లేకుంటే...మూడో ఉద్ధృతి తక్కువే

ప్రధానాంశాలు

Published : 18/09/2021 04:52 IST

కొత్త వేరియంట్‌ లేకుంటే...మూడో ఉద్ధృతి తక్కువే

వైరాలజి నిపుణురాలు గగన్‌దీప్‌ కాంగ్‌

దిల్లీ: దేశంలో కొత్తరకం కరోనా వైరస్‌ లేకపోతే, మూడో ఉద్ధృతి తీవ్రంగా ఉండదని ప్రముఖ వైరాలజీ నిపుణురాలు, ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ అభిప్రాయపడ్డారు. కొత్త వేరియంట్లను సమర్థంగా ఎదుర్కోవడానికి మరింత శక్తిమంతమైన వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యాన శుక్రవారం జరిగిన లైఫ్‌ సైన్సెస్‌ ఆన్‌లైన్‌ సదస్సులో ఆమె మాట్లాడారు. ‘‘కరోనా రెండో ఉద్ధృతి సమయంలో దేశంలో లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఎన్నో మరణాలు సంభవించాయి. కొత్త వేరియంట్‌ పుట్టకపోతే... మూడో ఉద్ధృతి ఆ స్థాయిలో ఉండదు. అయితే, ప్రజలు జాగ్రత్తలు పాటించని చోట్ల కేసులు పెరుగుతాయి. మహమ్మారి ముగియలేదు. సమీప భవిష్యత్తులో ముగిసిపోయే పరిస్థితి లేదు’’ అని కాంగ్‌ పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన