close

తాజావార్తలు

రియాల్టీషోలో జడ్జీని ముద్దుపెట్టుకున్న కంటెస్టెంట్‌

దిల్లీ: ఓ ఛానల్‌లో ప్రసారమవుతున్న రియాల్టీ షోలో జడ్జికి ఊహించని అనుభవం ఎదురైంది. షోలో పాల్గొనడానికి వచ్చిన వ్యక్తి.. మహిళా న్యాయనిర్ణేతకు ముద్దుపెట్టి అక్కడున్నవారందరినీ షాక్‌కు గురిచేశాడు. దీంతో కలత చెందిన ఆమె కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ ఘటన ’ఇండియన్‌ ఐడల్‌ 11’లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఈ షోలో ప్రముఖ గాయకులు అను మాలిక్‌, విశాల్‌ దడ్లానిలతో పాటు నేహా కక్కర్‌ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఓ గాయకుడు పాటపాడిన అనంతరం తనను గుర్తుపట్టాల్సిందిగా నేహాను కోరాడు. దాంతో ఆమె స్టేజీ మీదకు వెళ్లింది. అప్పుడు అతడు తన వెంట తీసుకొచ్చిన కొన్ని బహుమతులను ఆమెకు అందజేశాడు. ఆమె కృతజ్ఞతగా ఆ వ్యక్తిని కౌగిలించుకోగా..  ఒక్కసారిగా అతడు బలవంతంగా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. దీంతో షాక్‌కు గురైన సహ జడ్జీలు, యాంకర్‌ ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ ఊహించని సంఘటనకు కలత చెందిన నేహా అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.