చివరిది పోయింది

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

చివరిది పోయింది

మూడో వన్డేలో ఓడిన భారత్‌

కోలంబో: శ్రీలంకతో చివరిదైన మూడో వన్డేలో భారత్‌ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా.. అనేక మార్పులతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. సంజు శాంసన్‌, రాహుల్‌ చాహర్‌, నితీష్‌ రాణా, కృష్ణప్ప గౌతమ్‌, చేతన్‌ సకారియా వన్డే అరంగేట్రం చేశారు. శుక్రవారం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. తడబడింది. వర్షం వల్ల ఇన్నింగ్స్‌ను 47 ఓవర్లకు కుదించగా.. లంక స్పిన్నర్లు జయవిక్రమ (3/59), అకిల ధనంజయ (3/44) ధాటికి భారత్‌ 43.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. పృథ్వీ షా (49) టాప్‌ స్కోరర్‌. సంజు శాంసన్‌ (46), సూర్యకుమార్‌ (40) రాణించారు. అవిష్క ఫెర్నాండో (76), రాజపక్స (65) రాణించడంతో లక్ష్యాన్ని (డ/లూ పద్ధతిలో 227) శ్రీలంక 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్‌ చాహర్‌ మూడు వికెట్లు చేజిక్కించుకోగా.. సకారియా రెండు వికెట్లు పడగొట్టాడు. భారత్‌, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆదివారం ఆరంభమవుతుంది.

భారత్‌ ఇన్నింగ్స్‌: 225 (పృథ్వీ షా 49, సంజు శాంసన్‌ 46, సూర్యకుమార్‌ యాదవ్‌ 40, హార్దిక్‌ 19, ధావన్‌ 13, పాండే 11; జయవిక్రమ 3/59, అకిల ధనంజయ 3/44, చమీర 2/55);

శ్రీలంక ఇన్నింగ్స్‌: 227/7 (అవిష్క ఫెర్నాండో 76, రాజపక్స 65, అసలంక 24, రమేశ్‌ మెండిస్‌ 15 నాటౌట్‌; రాహుల్‌ చాహర్‌ 3/54, చేతన్‌ సకారియా 2/34)Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన