కోహ్లి కోసం ఆడండి

ప్రధానాంశాలు

Published : 18/10/2021 01:25 IST

కోహ్లి కోసం ఆడండి

దుబాయ్‌: కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి టీ20 ప్రపంచకప్‌ గెలిచేందుకు అర్హుడని భారత మాజీ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అన్నాడు. ప్రపంచకప్‌ తర్వాత టీ20 కెప్టెన్సీకి కోహ్లి గుడ్‌బై చెప్పనున్న నేపథ్యంలో అతడి కోసం జట్టు సత్తా చాటాలని అతడు కోరాడు. కప్‌ గెలిస్తే సారథిగా అతడికది ఘనమైన వీడ్కోలు అవుతుందన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు నినాదం ఒక్కటే కోహ్లి కోసం గెలవడం. ఎందుకంటే కెప్టెన్‌గా ఈ ఫార్మాట్లో అతడికిది ఇదే ఆఖరి టోర్నీ. అందుకే అభిమానులు ఎప్పుడెప్పుడు టీమ్‌ఇండియా బరిలో దిగుతుందా అని ఎదురు చూస్తున్నారు’’ అని రైనా చెప్పాడు. జట్టులో నైపుణ్యానికి కొదువ లేదని అయితే ప్రణాళిక ప్రకారం ఆడడం కీలకమని రైనా అన్నాడు. ‘‘మన జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదువు లేదు. టీమ్‌ఇండియా జోరు మీద కూడా ఉంది. అయితే ప్రణాళికలు అమలు చేయడమే ముఖ్యం. జట్టులో కీలక ఆటగాళ్లందరూ తాజాగా యూఏఈలో ఐపీఎల్‌ ఆడారు. ఈ వాతావరణానికి బాగా అలవాటుపడ్డారు. ఇక్కడ పిచ్‌లు కూడా భారత్‌ పిచ్‌లనే పోలి ఉంటాయి. మిగిలిన జట్లతో పోలిస్తే మన జట్టుకు కలిసొచ్చే అంశాలు ఇవే. ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజయవంతం కావాలంటే రోహిత్‌, రాహుల్‌, కోహ్లి 15 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయాలి. అప్పుడే భారీ స్కోరుకు పునాది పడుతుంది. అంతేకాదు ఎలాంటి లక్ష్యాన్ని అయినా ఛేదించగలం. రిషబ్‌ పంత్‌ కీలకపాత్ర పోషించబోతున్నాడు. లోయర్‌ఆర్డర్‌లో హార్దిక్‌ పాండ్యను కూడా తక్కువ చేయలేం. ఇక బౌలింగ్‌లో మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి యూఏఈ, ఒమన్‌ పిచ్‌లను సద్వినియోగం చేసుకునే  సత్తా ఉంది’’ అని రైనా పేర్కొన్నాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన