close

ప్రధానాంశాలు

Updated : 12/04/2021 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉద్రిక్తతలు చల్లారినందుకు భారత్‌ సంతోషించాలి: చైనా

బీజింగ్‌: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారినందుకు సంతోషపడమంటోంది చైనా. శుక్రవారం ముగిసిన  11వ రౌండ్‌ కోర్‌ కమాండర్‌ చర్చలకు సంబంధించి ఆదివారం చైనా సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రస్తుతం సరిహద్దుల్లో సానుకూల పరిస్థితులు నెలకొన్నాయని, ఉద్రిక్తతలు లేవని ఇందుకు భారత్‌ ఆనందించాలని పేర్కొంది. నిజానికి  13 గంటల పాటు తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్‌లో జరిగిన 11వ రౌండ్‌ కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల్లో చైనా తీవ్ర మొండి వైఖరిని అవలంబించింది. ఉద్రిక్త ప్రాంతాలైన దెస్పాంగ్‌, హాట్‌స్ప్రింగ్‌, గోగ్రాల నుంచి బలగాల ఉపసంహరణకు సుముఖత చూపలేదు. దీంతో పురోగతి లేకుండానే చర్చలు ముగిశాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన