అనిల్‌ అంబానీపైనా పెగాసస్‌ నిఘా!

ప్రధానాంశాలు

Published : 23/07/2021 06:10 IST

అనిల్‌ అంబానీపైనా పెగాసస్‌ నిఘా!

దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ, అడాగ్‌ గ్రూప్‌ కంపెనీలకు చెందిన సీనియర్‌ అధికారుల ఫోన్‌ నంబర్లూ పెగాసస్‌ డేటా బేస్‌లో ఉన్నాయని ‘ది వైర్‌’ వెల్లడించింది. అనిల్‌ అంబానీ ప్రస్తుతం ఆ ఫోన్‌ నంబర్లను వినియోగిస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఆ నివేదిక నిర్ధరించలేదు. అడాగ్‌ గ్రూప్‌ నుంచి కూడా తక్షణ స్పందన వెలువడలేదు. రఫేల్‌ యుద్ధ విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్‌కు భారత దేశ ప్రతినిధిగా ఉన్న వెంకటరావు పోసిన, సాబ్‌ ఇండియా మాజీ అధిపతి ఇంద్రజిత్‌ సియాల్‌, బోయింగ్‌ ఇండియా అధినేత ప్రత్యూష్‌ కుమార్‌ ఫోన్‌ నంబర్లు కూడా లీకైన జాబితాలో ఉన్నట్లు తెలిపింది.

సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌వర్మపైనా..

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డైరెక్టర్‌ పదవి నుంచి ఆలోక్‌ వర్మను తొలగించిన (2018, అక్టోబరు 23)తర్వాత ఆయన, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 8 ఫోన్‌ నంబర్లపైనా పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించి గుర్తుతెలియని భారతీయ సంస్థ నిఘా పెట్టినట్లు ‘ది వైర్‌’ పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన