ఒక్క రోజులో 2.5 కోట్ల డోసులు

ప్రధానాంశాలు

Published : 18/09/2021 05:01 IST

ఒక్క రోజులో 2.5 కోట్ల డోసులు

కొవిడ్‌ టీకాల్లో సరికొత్త రికార్డు
మోదీకి జన్మదిన కానుక: కేంద్ర మంత్రి

దిల్లీ: ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. దేశంలో ఒక్క రోజులో ప్రజలకు రెండున్నర కోట్లకు పైగా టీకా డోసులు అందించారు. కొవిన్‌ పోర్టల్‌ సమాచారం ప్రకారం రాత్రి 12 గంటల వరకు వేసిన డోసుల సంఖ్య 2.5 కోట్లు దాటింది. ఒక రోజులో కోటికి పైగా వ్యాక్సిన్‌ డోసులు అందించడం గత 22 రోజుల్లో ఇది నాలుగో సారి. ఇంతవరకు ఆగస్టు 27, 31, సెప్టెంబరు 6 తేదీల్లో కోటికి పైగా డోసులు వేశారు. దేశంలో ప్రజలకు ఇంతవరకు వేసిన మొత్తం టీకా డోసుల సంఖ్య 79.33 కోట్లు దాటడం విశేషం. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారీఎత్తున వ్యాక్సినేషన్‌ చేపట్టాలంటూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గురువారం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

చరిత్రాత్మకం..

‘‘దేశంలో ఒక రోజులో 2 కోట్లకు పైగా టీకా డోసులు వేయడం చరిత్రాత్మకం. ఇదో సరికొత్త రికార్డు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశ ప్రజలు, ఆరోగ్య సిబ్బంది తరఫున ఆయనకు ఇదో కానుక’’ అని కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన