సాహితీవేత్త మనోరమ మహాపాత్ర్‌ కన్నుమూత

ప్రధానాంశాలు

Published : 20/09/2021 05:00 IST

సాహితీవేత్త మనోరమ మహాపాత్ర్‌ కన్నుమూత

సంతాపం తెలిపిన ఉప రాష్ట్రపతి, ప్రధాని

కటక్‌, న్యూస్‌టుడే: ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ‘సమాజ’ దినపత్రిక మాజీ సంపాదకురాలు మనోరమ మహాపాత్ర్‌(87) శనివారం ఛాతీనొప్పితో కన్నుమూశారు. అనారోగ్యంతో కటక్‌లోని ఎస్సీబీ మెడికల్‌ కళాశాలలో చేరిన ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మనోరమ మృతి పట్ల ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ ద్వారా సంతాపం ప్రకటించారు. పాత్రికేయురాలిగా, సాహితీవేత్తగా దేశానికి మహత్తరమైన సేవలందించారని కొనియాడారు. మనోరమ సాహిత్యభాండాగారమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గొప్ప సాహితీవేత్తను రాష్ట్రం కోల్పోయిందని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. మనోరమ భౌతికకాయానికి పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు నివాళులర్పించారు. ఆదివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన