1% దిగువకు క్రియాశీలక కేసులు

ప్రధానాంశాలు

Published : 20/09/2021 05:00 IST

1% దిగువకు క్రియాశీలక కేసులు

దిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య ఆదివారం తగ్గింది. క్రియాశీలక కేసులు కూడా 1 శాతం కంటే దిగువకు తగ్గాయి. గత 24 గంటల్లో 30,773 మంది కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. 309 మంది కొవిడ్‌తో మృతి చెందారు. క్రితం రోజుతో పోలిస్తే 4,889 కేసులు తగ్గాయి. మొత్తం కేసుల సంఖ్య 3,34,48,163కి చేరగా.. మహమ్మారి బారిన పడి ఇంతవరకు 4,44,838 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 38,945 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల సంఖ్య ఇంతకంటే తక్కువ ఉండటంతో.. క్రియాశీలక కేసుల సంఖ్య 3,32,158 (0.99%)కి తగ్గింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన