5-11 ఏళ్ల చిన్నారులకు మా టీకా సురక్షితం

ప్రధానాంశాలు

Updated : 21/09/2021 05:47 IST

5-11 ఏళ్ల చిన్నారులకు మా టీకా సురక్షితం

వెల్లడించిన ఫైజర్‌, బయోఎన్‌టెక్‌

దిల్లీ: చిన్నారులకు తమ టీకా సురక్షితమేనని, వారిలో కరోనా వ్యతిరేక యాంటీబాడీల ఉత్పత్తికి దోహదపడుతోందని ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ ఎస్‌ఈలు సోమవారం వెల్లడించాయి. 5-11 ఏళ్ల వయసు పిల్లలకు త్వరలోనే టీకాను అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశాయి. త్వరగా అనుమతులు తీసుకోనున్నట్టు తెలిపాయి. 12 ఏళ్ల కంటే పెద్దవారికి 30 మైక్రోగ్రాముల పరిమాణంలో టీకా అందిస్తున్నారు. ఒకటి, రెండు దశల క్లినికల్‌ పరీక్షల సందర్భంగా- అమెరికా, ఫిన్‌లాండ్‌, పోలండ్‌, స్పెయిన్‌లలో 5-11 ఏళ్లున్న 4,500 మంది చిన్నారులకు.. 10 మైక్రోగ్రాముల చొప్పున 2 డోసులు అందించారు. ‘‘మా టీకా చిన్నారులకూ సురక్షితమేనని తేలింది. 21 రోజుల వ్యవధితో 2 డోసులు అందించాం. వారిలో యాంటీబాడీలు సంతృప్తికరస్థాయిలో ఉత్పత్తి అయ్యాయి’’ అని ఫైజర్‌ ఛైర్మన్‌ ఆల్బెర్ట్‌ బోర్లా, బయోఎన్‌టెక్‌ సీఈవో ఉగర్‌ సాహిన్‌లు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన