భారత్‌లో మతోన్మాదానికి తావులేదు

ప్రధానాంశాలు

Updated : 29/09/2021 06:25 IST

భారత్‌లో మతోన్మాదానికి తావులేదు

 సహజీవన వారసత్వాన్ని  మరింత బలోపేతం చేసుకోవాలి

కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ

దిల్లీ: భారత్‌లో మతోన్మాదానికి, అసహనానికి తావులేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. దేశంలో ఆస్తికులు, నాస్తికులు సమాన హక్కులతో కలిసి మెలిసి జీవిస్తున్నారని చెప్పారు. భారత్‌ వంటి దేశాల్లో బలవంతపు మత మార్పిడులు ఏ మత వ్యాప్తికి కొలమానం కాదన్నారు. క్రైస్తవ మైనార్టీ ప్రముఖులతో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో నఖ్వీ మాట్లాడారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, మత విజ్ఞాన కేంద్రంగా భారత్‌ విలసిల్లుతోంది. సర్వధర్మ సమభావనకు, వసుదైక కుటుంబ భావనకు స్ఫూర్తినందిస్తున్న మన దేశంలో మతోన్మాదానికి, అసహనానికి తావు లేదు. దేవుడిని విశ్వసించేవారికి, నాస్తికులకు సమాన రక్షణ; సమాన రాజ్యాంగ, సామాజిక హక్కులు లభిస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వానికి మనదేశమే ప్రతీక. అన్ని మతాల పండుగలను కలిసికట్టుగా నిర్వహించుకునే సంప్రదాయం ఒక్క భారత్‌కే సొంతం. ఈ సాంస్కృతిక, సహజీవన వారసత్వాన్ని మనం మరింత బలోపేతం చేసుకోవాలి. మన ఐక్యతను, సామరస్యాన్ని అస్థిరపరిచే ఏ ప్రయత్నమైనా దేశ ఆత్మను గాయపరుస్తుంది’’ అని నఖ్వీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జాన్‌ బార్లా, జాతీయ మైనారిటీ కమిషన్‌ ఛైర్మన్‌ ఇక్బాల్‌ సింగ్‌, ఆర్చ్‌ బిషప్‌ అనిల్‌ జోసెఫ్‌ తదితరులు పాల్గొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన