తెలంగాణ పాఠశాలల్లో అమెజాన్‌ గ్లోబల్‌ కంప్యూటర్‌ సైన్స్‌

ప్రధానాంశాలు

Published : 29/09/2021 06:18 IST

తెలంగాణ పాఠశాలల్లో అమెజాన్‌ గ్లోబల్‌ కంప్యూటర్‌ సైన్స్‌

దిల్లీ: భారత్‌లో గ్లోబల్‌ కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌) విద్యా కార్యక్రమమైన అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజినీర్‌ (ఎఎఫ్‌ఈ)ని ప్రారంభిస్తున్నట్లు అమెజాన్‌ మంగళవారం ప్రకటించింది. మొదటి ఏడాదిలో లక్ష మందికి పైగా విద్యార్థులకు చేరువ కావాలన్నది అమెజాన్‌ లక్ష్యం. తెలంగాణ, కర్ణాటక, దిల్లీ, హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాల్లో 900 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు లాభాపేక్ష లేని సంస్థలతో అమెజాన్‌ జట్టు కట్టనుంది. పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్‌ సైన్స్‌ విద్య నేర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అమెజాన్‌ ఇండియా గ్లోబల్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, కంట్రీ హెడ్‌ అమిత్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన