మొలాసిస్‌ నుంచి తీసిన పొటాష్‌కు రాయితీ ఖరారు

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:48 IST

మొలాసిస్‌ నుంచి తీసిన పొటాష్‌కు రాయితీ ఖరారు

ఈనాడు, దిల్లీ: చక్కెర కర్మాగారాల్లో ఉత్పత్తయ్యే మొలాసిస్‌ నుంచి తీసిన పొటాష్‌ (పీడీఎం)కు రాయితీని కేంద్రం తొలిసారిగా ఖరారు చేసింది. దీనివల్ల పొటాషియం దిగుమతులపై ఆధారపడడం కొంతవరకు తగ్గుతుందని పేర్కొంది. 50 కిలోల పీడీఎం బస్తాపై రూ.73 రాయితీ లభిస్తుంది. కేంద్ర కేబినెట్‌ సమావేశం ఇటీవల దీనికి ఆమోదం తెలపగా గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పొటాష్‌పై రాయితీ కింద ఏటా రూ.156 కోట్లు ఖర్చు చేసి, రూ.562 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బస్తా డీఏపీ ఎరువుపై రూ.438, అదనపు రాయితీగా ఎన్‌పీకే ఎరువుపై రూ.100 ఇవ్వాలన్న నిర్ణయంపైనా నోటిఫికేషన్‌ వెలువడిందిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన