రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంతం వర్తించదు

ప్రధానాంశాలు

Published : 19/10/2021 05:14 IST

రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంతం వర్తించదు

ట్రైబ్యునల్‌ సంస్కరణ చట్టంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌

ఈనాడు, దిల్లీ: వివాదాస్పదంగా మారిన ట్రైబ్యునల్‌ సంస్కరణ చట్టం-2021ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకొంది. ఈ చట్టం రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంత సూత్రానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ దాని ఆధారంగా చట్టాన్ని కొట్టేయలేరని పేర్కొంది. కేంద్రం తీసుకొచ్చిన ట్రైబ్యునల్‌ సంస్కరణ చట్టాన్ని సవాల్‌చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌, మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌, ఇతరులు దాఖలు చేసిన కేసులకు సమాధానమిస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ‘‘రెండు రాజ్యాంగ ధర్మాసనాలు, మరో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుల ప్రకారం రాజ్యాంగ సవరణల ప్రామాణికతను నిర్ధారించడానికే రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంత సూత్రం పరిమితం. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు చట్టాల పరిశీలన ప్రాతిపదిక కాదు. విధానాల రూపకల్పనలో భాగంగా పార్లమెంటు చట్టాలు, కార్యనిర్వాహక వ్యవస్థ నిబంధనలు రూపొందిస్తుంది. అలాంటి చట్టాలు, నిబంధనలు ఎవరి ప్రాథమిక హక్కులకు కానీ, రాజ్యాంగ నిబంధనలకు కానీ విరుద్ధంగా లేకుండా పూర్తిగా వాటి అధికార పరిధిలోనే ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ స్వతంత్రత పేరుతో వాటిని కొట్టేయడం మంచిది కాదు’’ అని కేంద్రం పేర్కొంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన