కొత్తగా 15,906 మందికి కరోనా

ప్రధానాంశాలు

Published : 25/10/2021 04:54 IST

కొత్తగా 15,906 మందికి కరోనా

దిల్లీ: దేశంలో కొవిడ్‌ తీవ్రత గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా 24 గంటల్లో కేవలం 15,906 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. కొత్త కేసులు 30 వేల లోపు నమోదు కావడం వరుసగా ఇది 30వ రోజు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం క్రియాశీలక కేసులు 1,72,594గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 0.51% మాత్రమే. ప్రస్తుతం రికవరీ రేటు 98.17%గా ఉంది. 2020 మార్చి తర్వాత ఇదే అత్యధికం. తాజాగా 561 కొవిడ్‌ సంబంధిత మరణాలు గణాంకాల్లో చేరాయి. మొత్తం మృతుల సంఖ్య 4,54,269కి పెరిగింది. కేరళలో 24 గంటల్లో కేవలం 65 మంది కరోనా మృతిచెందినప్పటికీ.. అంతకుముందు చోటుచేసుకున్న మరో 399 మరణాలనూ ఆ రాష్ట్రం తాజాగా కొవిడ్‌ లెక్కల్లో చేర్చింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన