గత ఏడాది రికార్డు స్థాయిలో గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు

ప్రధానాంశాలు

Published : 26/10/2021 05:19 IST

గత ఏడాది రికార్డు స్థాయిలో గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు

 కరోనా లాక్‌డౌన్‌ సమయంలో స్వల్పంగా తగ్గినా గత దశాబ్ద సగటు కన్నా వేగంగా పెరుగుదల

ప్రపంచ వాతావరణ సంస్థ నివేదికలో వెల్లడి

జెనీవా: భూ తాపానికి కారణమయ్యే గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు గత ఏడాది రికార్డుస్థాయిలో పెరిగాయని ప్రపంచ వాతావరణ సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఉద్గారాల విడుదల స్వల్పంగా తగ్గుముఖం పట్టినా మొత్తం మీద వాటి పెరుగుదల గత దశాబ్దపు సగటు వృద్ధి రేటు కన్నా అధికంగా ఉందని పేర్కొంది. భూ తాపాన్ని నివారించేందుకు అంతర్జాతీయంగా గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల విడుదల స్థాయిని క్రమంగా తగ్గించుకోవాలన్న లక్ష్యసాధనలో వెనుకబడిపోతున్నామంటూ ఐక్యరాజ్యసమితి వాతావరణ కార్యాలయం హెచ్చరికలు చేసిన నేపథ్యంలో తాజా నివేదిక వెలువడడం గమనార్హం. ఈనెల 31నుంచి నవంబరు 12 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ఐరాస పర్యావరణ మార్పుల సదస్సు-కాప్‌26 జరగనుంది. ప్రపంచ దేశాలు సమావేశమై గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల తగ్గింపుపై లక్ష్యాలను నిర్దేశించుకోనున్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన