కంటైనర్లలో సంచార ఆసుపత్రులు: మాండవీయ

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:50 IST

కంటైనర్లలో సంచార ఆసుపత్రులు: మాండవీయ

దిల్లీ: అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం కంటైనర్‌ ఆధారిత సంచార ఆసుపత్రులు నెలకొల్పనుంది. ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక వసతుల మిషన్‌ కింద ఇలాంటివి రెండు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 100 పడకల సామర్థ్యంగల కంటైనర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవసరం మేరకు వీటిని రైలు, వాయుమార్గాల్లో తరలించడానికి వీలు ఉంటుందని తెలిపారు. దిల్లీ, చెన్నైల్లో వీటిని నెలకొల్పుతామని చెప్పారు. ఆసుపత్రుల్లో ఉండే సౌకర్యాలన్నీ వీటిల్లో ఉంటాయని వివరించారు. ఆరోగ్య సౌకర్యాల కల్పనకు ప్రతి జిల్లాకు సగటున రూ.90-100 కోట్లు ఖర్చు చేస్తామని, జిల్లా స్థాయిలో 134 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన