
తాజా వార్తలు
దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో గత కొన్ని రోజులుగా పసిడి ధర పరుగులు పెడుతోంది. బుధవారం ఒక్కరోజే రూ. 320 పెరగడంతో బంగారం ధర రూ. 34వేల మార్క్‌ను దాటింది. బులియన్ మార్కెట్లో నేడు 10 గ్రాముల పుత్తడి రూ. 34,070 పలికింది. అటు వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు డిమాండ్ ఊపందుకోవడంతో కేజీ వెండి ధర రూ. 330 పెరిగి రూ. 41,330కి చేరింది.
చైనాకు చెందిన హువావే సంస్థపై క్రిమినల్ విచారణకు అమెరికా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అమెరికా-చైనా మధ్య జరిగే వాణిజ్య చర్చలపై అనిశ్చితి ఏర్పడింది. ఈ పరిణామాలపై దృష్టిపెట్టిన మదుపర్లు బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని భావించారని, తద్వారా పసిడి ధర పెరిగినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
గత రెండు రోజుల్లో బంగారం ధర రూ. 450 పెరిగింది. అంటే ఈ వారంలో ఇప్పటివరకు 10 గ్రాముల పసిడి ధర రూ. 770 పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా కూడా ఈ లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,314.76 డాలర్లు, ఔన్సు వెండి ధర 15.96 డాలర్లు పలికింది.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రఘురామ కృష్ణరాజువిందుకు రాజ్‌నాథ్‌సింగ్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
