close

తాజా వార్తలు

ఘనంగా ఆకాశ్‌ అంబానీ బ్యాచిలర్‌ పార్టీ

గుర్రపు బండిలో ఊరేగిన ఆకాశ్‌-శ్లోకా

స్విట్జర్లాండ్‌: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ అంబానీ-శ్లోకా మెహతాల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్‌లో ఘనంగా బ్యాచిలర్‌ పార్టీ ప్రారంభమైంది. స్విస్‌లోని సెయింట్‌ మోర్తిజ్‌ వేదికగా ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. సినీ ప్రముఖులు రణ్‌బీర్‌ కపూర్‌,అలియా భట్‌, అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా, కరణ్‌ జోహార్‌, పింకీ రెడ్డి తదితరులు ఈ వేడుకకు హాజరయినట్లు తెలుస్తోంది.

వేడుకల్లో భాగంగా కాబోయే వధూవరులు ఆకాశ్‌-శ్లోకా ఇద్దరు తెలుపురంగు గుర్రపు బండిలో వేదిక వద్దకు వచ్చారు. ఇదే బండిలో కాసేపు ఊరేగారు. ఈ వేడుకకు సుమారు 850 మంది అతిథులు పాల్గొన్నారని అంబానీ సన్నిహితులు తెలిపారు. అతిథుల సౌకర్యార్థం హోటల్‌ మోర్టిజ్‌లోని అత్యంత విలాసవంతమైన గదులను బుక్‌ చేశారట. వినోదం కోసం అక్కడి లూనా పార్క్‌లో ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ రోజుతో స్విస్‌లో బ్యాచిలర్‌ వేడుకలు ముగుస్తాయి. ఆకాశ్‌-శ్లోకల వివాహం మార్చి 9న ముంబయిలో జరగనుంది. అయితే ఈ బ్యాచిలర్‌ పార్టీకి సంబంధించిన ఫొటోలు, కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.