
తాజా వార్తలు
మెహుల్ ఛోక్సికి బాంబే హైకోర్టు ఆదేశం
ముంబయి: తన ఆరోగ్య పరిస్థితిపై వెంటనే మెడికల్ ప్రతాలను సమర్పించాలని పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సిని బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. పరిశీలన నిమిత్తం ఆ పత్రాలను ముంబయిలో ఆసుప్రతికి సమర్పించాలని, దాన్ని బట్టి అతడు ప్రయాణం చేయొచ్చో లేదో తేలుస్తామని వెల్లడించింది.
ఛోక్సి భారత్‌కు రావడానికి ప్రయాణం చేయొచ్చో లేదో ముంబయిలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జేజే ఆసుపత్రి వైద్య బృందం పరిశీలిస్తారని హైకోర్టు వెల్లడించింది. ఆ తరవాత ఆ పత్రాలను కోర్టుకు సమర్పించాలని తెలిపింది. ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో ఉంటోన్న ఛోక్సిని తీసుకురావడానికి ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామని శనివారం ఈడీ కోర్టుకు వెల్లడించింది. ఈడీ వాదనలు విన్న తరవాత కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. న్యాయ విచారణను ఆలస్యం చేయడానికి ఛోక్సి ఆరోగ్యకారణాలను వంకగా చూపిస్తూ, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఈడీ వెల్లడించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు మోసం చేసిన వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీకి ఛోక్సి బంధువు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రాహుల్‌కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
