
తాజా వార్తలు
న్యూదిల్లీ: దిల్లీ-ఇస్తాంబుల్ మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీసులు దాదాపు ఐదో వంతు ప్రయాణికుల సంఖ్యను తగ్గించుకోనున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ మేరకు మార్గదర్శకాలను సూచించింది. ముఖ్యంగా ఇటీవల వాతావరణంలో మార్పుల కారణంగా పడమటి గాలులు బలంగా వీస్తుండటంతో భద్రతా ప్రమాణాల కోసం 15-20శాతం సీట్లను ఖాళీగా వదిలేయాలని ఆ విమానయాన సంస్థకు వెల్లడించింది.
కొన్నాళ్ల క్రితం ఇదే విమానయాన సంస్థకు చెందిన ఒక విమానం ఈ మార్గంలో వెళుతూ ప్రయాణికుల సామగ్రిని తీసుకుపోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో డీజీసీఏ ఈ సూచన చేసింది. ముఖ్యంగా వాతావరణ మార్పులను ఎదుర్కొవాల్సి వచ్చే విమానాలకే ఈ సూచన చేసింది.
‘‘ ఆ మార్గంలో విమానాలు ఎక్కువ ఇంధనాన్ని వాడుకొంటాయి. అందుకే తక్కువ లోడును తీసుకెళ్లాలి.’’ అని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు.
విమానాలు 30-60 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రయాణిస్తుండే సమయలో బలమైన గాలులు పడమటి నుంచి తూర్పువైపునకు వీస్తుంటాయి. ప్రస్తుతం ఇండిగో దిల్లీ-ఇస్తాంబుల్ మార్గంలో ఎయిర్‌బస్-ఏ320, ఏ321 విమానాలను నడుపుతోంది. ఏ320లో 186 మంది, ఏ321లో 222 మంది ప్రయాణించగలరు. ప్రస్తుతం డీజీసీఏ సూచనతో ఇప్పుడు వీరిలో ఐదోవంతు మంది ప్రయాణికులను తగ్గించుకోవాల్సి ఉంటుంది.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
