
తాజా వార్తలు
పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించిన ప్రధాని మోదీ
న్యూయార్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొని మాట్లాడారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి బంగారు అవకాశాలున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘నాణ్యతా ప్రమాణాలతో పెట్టుబడులు పెట్టాలనుకుంటే భారత్‌కు రండి. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి సువర్ణావకాశాలున్నాయి. పెద్ద మార్కెట్లలో అంకురాలు మొదలు పెట్టాలన్నా ఇండియాకు రండి. ప్రపంచంలోనే అతి పెద్ద మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే భారత్‌కు రండి. నగరీకరణలో పెట్టబడి పెట్టాలన్నా ఇండియానే సరైన స్థానం. మీకు ఎన్నో సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఎదురు చూస్తోంది. అంతర్జాతీయ వ్యాపార సమాజంతో మేం భాగస్వాములం కావాలనుకుంటున్నాం. ఇది మీకు సువర్ణావకాశం. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి మేం చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. రండి.. మీకు నేను వారథిలా ఉంటాను’ అని ప్రధాని అన్నారు.
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మోదీ వివరించారు. భారత్ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని తెలిపారు. కార్పొరేట్ పన్ను తగ్గించి వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు. ఆహారం నుంచి రవాణా వరకు, సినిమా నుంచి స్థానిక డెలివరీ సేవల వరకు అంకుర సంస్థలు దూసుకుపోతున్నాయని, పేద, మధ్య తరగతి ప్రజలకు పదుల మిలియన్ల సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తున్నామని వివరించారు. గత ఐదేళ్లలో 286 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు భారత్‌కు వచ్చినట్లు మోదీ తెలిపారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
