close

తాజా వార్తలు

రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దుర్గమ్మ

రన్నవరాత్రి ఉత్సవాల్లో చివరిరోజైన విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని... ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గాదేవిని రాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తారు. రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమి పర్వదినాన్ని చేసుకోవడం ఆనవాయితీగా ఏర్పడింది. రాజరాజేశ్వరీదేవిని అపరాజితాదేవి అనీ పిలుస్తారు. అన్ని లోకాలకు ఈమె ఆరాధ్య దేవత. దేవతలందరి సమష్ఠి స్వరూపంగా జ్యోతి స్వరూపంతో ప్రకాశిస్తూ పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుంటుంది. శ్రీచక్రాన్ని అధిష్ఠించి, యోగమూర్తిగా దర్శనమిస్తుంది. ఈమెను పూజించటం ద్వారా మనోచైతన్యం ఉద్దీపితమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సమున్నతమైన దైవికశక్తికి ఈమె ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగిఉండటం, ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి మహిళలు అందుకోవాల్సిన స్ఫూర్తి. కుటుంబసభ్యులు నిర్వేదానికి గురైన సందర్భాల్లో వారిని ఓదార్చి, వారిలో పట్టుదల రేకెత్తించి లక్ష్యసాధన దిశగా ప్రేరేపించాల్సిన బాధ్యత మహిళలపై ఉంటుంది. ఇది గురుతరమైన బాధ్యత. దీన్ని సమర్థంగా నిర్వహించగలిగిన శక్తి కూడా మహిళలకు మాత్రమే ఉంటుందని రాజరాజేశ్వరీ అవతారం నుంచి సందేశాన్ని అందుకోవచ్చు. శాశ్వతమైన ఆనందానికి, విజయానికి రాజరాజేశ్వరి ప్రతీక. కొద్దిపాటి విజయంతోనే ప్రయత్నాన్ని ఆపకుండా నిరంతర ఉద్యమంగా జీవితాన్ని సాగించాలనే స్ఫూర్తిని ఈ అవతారం నుంచి పొందవచ్చు. త్రిమూర్తుల కన్నా రాజరాజేశ్వరీదేవి ఉన్నతమైన స్థానం కలిగిఉంటుంది. ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్నతమైన స్థానం మహిళకే ఉందనటానికి ఇది నిదర్శనం. పరిపూర్ణతకు ఈ అమ్మ అసలైన చిహ్నం. సృష్టిలో మరే ఇతర దైవానికి ఈ స్థాయి కలగలేదు. మహిళకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం ఇది.

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.