close

తాజా వార్తలు

శాంసంగ్‌ A50s, A30s ధరల తగ్గింపు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ ఇటీవలే విడుదల చేసిన తన గెలాక్సీ A50s, A30s ధరలను తగ్గించింది. A50, A30కి కొనసాగింపుగా తీసుకొచ్చిన ఈ రెండు ఫోన్ల ధరలను రూ.3వేల వరకు తగ్గించింది. తగ్గింపు ధరలతో అటు ఆన్‌లైన్‌తో పాటు ఇటు ఆఫ్‌లైన్‌లోనూ ఈ ఫోన్లు లభించనున్నాయి.  A30sపై వెయ్యి రూపాయలు తగ్గించగా..  A50s పై రూ.3వేలు కంపెనీ తగ్గించింది.

A50s 4జీబీ/128జీబీ వేరియంట్‌ ధర రూ.22,999 కాగా.. తగ్గింపు అనంతరం ఇకపై రూ.19,999కే లభించనుంది. 6జీబీ/128జీబీ వేరియంట్‌ తగ్గింపు అనంతరం రూ.21,999కే దొరుకుతుంది. A30s 4జీబీ/64 జీబీ వేరియంట్‌ వెయ్యి రూపాయల తగ్గింపు అనంతరం రూ.15,999కే లభించనుంది. శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌తో పాటు, అమెజాన్‌, ఇతర వెబ్‌సైట్లలో తగ్గింపు ధరలకే ఈ ఫోన్లు లభించనున్నాయి. ఈ ధరలు శాశ్వతంగా తగ్గించినట్లు శాంసంగ్‌ తెలిపింది.

A 50s స్పెసిఫికేషన్స్‌
* 6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే
* ఎగ్జినోస్‌ 9611 ప్రాసెసర్‌
* వెనుక వైపు 48+8+5 ఎంపీల కెమెరాలు 
* 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
* 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
* ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఎన్‌ఎఫ్‌సీ, 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌

A 30s స్పెసిఫికేషన్స్‌...
* 6.4 అంగుళాల హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే
* ఎగ్జినోస్‌ 7904 ప్రాసెసర్‌
* వెనుకవైపు 25+8+5 ఎంపీల కెమెరాలు
* ముందు వైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
* 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
* ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, 15W ఫాస్ట్‌ చార్జింగ్‌, ఎన్‌ఎఫ్‌సీ


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.