
తాజా వార్తలు
నియమితులైన 27 ఏళ్ల యువకుడు
దిల్లీ: టాటాసన్స్ సంస్థల గౌరవ ఛైర్మన్ రతన్ టాటాకు శునకాలపై ఉన్న ప్రేమ ఓ యువకుడికి బంపర్ ఆఫర్ తెచ్చిపెట్టింది. ముంబయికి చెందిన 27 ఏళ్ల శంతను నాయుడు రతన్ టాటాకు అసిస్టెంట్‌గా నియమితులయ్యాడు. వాహనాల నుంచి వీధి శునకాల రక్షణ కోసం ఇతను కనిపెట్టిన ఓ పద్ధతి రతన్ టాటాకు ఎంతగానో నచ్చింది. తాను రతన్ టాటాను కలిసింది మొదలు, తనకు ఉద్యోగం వచ్చిన తీరును శంతను నాయుడు ఫేస్‌బుక్‌లోని ‘హ్యుమన్స్ ఆఫ్ బాంబే’ అనే గ్రూపులో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఐదేళ్ల క్రితం శంతను రోడ్డుపై వెళ్తుండగా వాహనం ఢీకొని ఓ వీధి శునకం మరణించడం చూశాడు. దీనికి పరిష్కార మార్గం కనుగొనాలని సంకల్పించాడు. డ్రైవర్లకు దూరం నుంచి శునకాలు కనిపించేలా వాటి మెడకు తగిలించేందుకు పరావర్తనం (రిఫ్లెక్ట్) చెందే బెల్టులను తయారు చేశాడు. దీనివల్ల దూరం నుంచే డ్రైవర్లు రోడ్లపై శునకాలను గుర్తించగలుగుతారు.
ఈ ఆలోచన విస్తృతంగా వ్యాపించి, టాటా గ్రూపు సంస్థల న్యూస్ లెటర్లో అచ్చయింది. ‘‘సరిగ్గా ఇప్పుడే మా నాన్న రతన్ టాటాకు ఓ లేఖ రాయాలని సూచించారు. ఎందుకంటే రతన్ టాటాకు కూడా శునకాలంటే ఇష్టమని అన్నారు. తొలుత ఇందుకు నేను తటపటాయించినా, తర్వాత టాటాకు లేఖ రాశాను. ఇదే నా జీవితాన్ని మలుపు తిప్పింది.’’
‘‘రెండు నెలల తర్వాత నన్ను కలవాలని అనుకుంటున్నట్లు రతన్ టాటా నుంచి సమాధానం వచ్చింది. నేను నమ్మలేకపోయా!! కొద్ది రోజులకే ఎంతో గొప్ప వ్యక్తిని ముంబయిలోని ఆయన కార్యాలయంలో కలిశాను. నేను చేసిన పని ఆయనకు ఎంతగానో నచ్చిందని టాటా చెప్పారు. తర్వాత నేను నా పైచదువులకు విదేశాలకు వెళ్లా. వచ్చాక నా జీవితమంతా టాటా ట్రస్టుకే అంకితం చేస్తానని ఆయనకు చెప్పా. నేను భారత్‌కు వచ్చాక ఆయన కాల్ చేశారు. ఇక్కడ పని చేయాల్సింది చాలా ఉందని నన్ను ఆహ్వానించారు. నువ్వు నా అసిస్టెంట్‌గా ఉంటావా? అని అడిగారు. కొన్ని క్షణాల పాటు ఎలా స్పందించాలో నాకర్థం కాలేదు. వెంటనే సరే అని చెప్పేశాను.’’ అని శంతను నాయుడు ఫేస్బుక్ పోస్ట్‌లో వివరించారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- దిశ తల్లిదండ్రులకు ఎన్హెచ్ఆర్సీ పిలుపు
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
