
తాజా వార్తలు
కాలేజీలు తెరవనున్నారు... ఈ విద్యా సంవత్సరంలోనూ సరికొత్త ఫ్యాషన్లు అమ్మాయిల్ని ఆకట్టుకోనున్నాయి. వాటిని తమ శరీరతత్వానికి తగ్గట్లు స్టైలింగ్ చేసుకోగలగడమే ఇప్పుడు అమ్మాయిల ముందున్న సవాల్. కాలేజీలో ఫ్యాషన్ ఐకాన్‌గా నిలవాలంటే... కుర్తీల నుంచి కాఫ్తాన్ల వరకూ ఎలా ఎంచుకోవచ్చో చెప్పే సూచనలివి.!
ఇప్పటివరకూ సంప్రదాయంగా వాడిన స్ట్రెయిట్ హెమ్‌లైన్ కుర్తీలకు ఇక టాటా చెప్పేద్దాం...ఎందుకంటే ఎసెమెట్రికల్ డిజైన్లలో కుర్తీలను ఎంచుకోవడమే ఇప్పటి ఫ్యాషన్. ఈ డిజైను అన్ని రకాల శరీరాకృతుల వారికీ నప్పుతుంది. ఎత్తు తక్కువగా ఉన్నవారికి చక్కని ఎంపిక. స్నేహితులతో కలిసి బయటికి వెళ్లినప్పుడు, చిన్న చిన్న వేడుకలకి ఇవి స్టైలిష్ లుక్‌ని తెచ్చిపెడతాయి. వీటికి జతగా జీన్స్, పలాజోలు నప్పుతాయి. వీటిమీదకు స్నీకర్స్, స్ట్రాప్డ్ హీల్స్‌ని వేసుకోవచ్చు. ప్లెయిన్ స్ట్రెయిట్ కుర్తీ వేసుకున్నప్పుడు ఎసెమెట్రికల్ లాంగ్ జాకెట్‌ని ప్రయత్నించినా మీ లుక్ మారిపోతుంది. ఈ తరహా దుస్తులు వేసుకున్నప్పుడు చెవులకు వేలాడే లోలాకులు బాగుంటాయి. పామ్పామ్ ఇయర్రింగ్స్ సరైన మ్యాచింగ్.
* ఫ్లోరల్ ధోతీ టాప్ కాలేజీలకు సౌకర్యంగా వేసుకోవచ్చు. పెప్లమ్ టాప్లకు ధోతీ చక్కటి మ్యాచింగ్. ఆధునికతకు సంప్రదాయాన్ని మేళవించిన నయా శైలి ఇది. ఫ్రెషర్స్ పార్టీలకూ దీన్ని ప్రయత్నించవచ్చు. జార్జెట్, షిఫాన్, సిల్క్ వంటి వస్త్రాలతో ధోతీ ప్యాంట్లు కుట్టించుకోవచ్చు. ఈ దుస్తుల మీదకు కాస్త పెద్దగా ఉండే స్టడ్స్ లేదా చిన్నచిన్న హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు. పీప్టోస్, శాండిల్స్ నప్పుతాయి.
* లాంగ్ స్ట్రెయిట్ కుర్తీలకు జతగా కాఫ్‌లెంగ్త్ ప్యాంట్లు బాగుంటాయి. అంచుల్లో ఫ్రిల్స్, ప్యాటర్న్లు చేయించుకోవచ్చు. పైన జాకెట్ వేసుకుంటే ట్రెండీ లుక్‌తో కనికట్టు చేయొచ్చు. జతగా స్కార్ఫ్‌ని భిన్నంగా చుట్టుకుంటే చాలు. చెవులకు దిద్దులూ, లెదర్వాచ్, ఫ్లాట్స్ ట్రెండీగా కనిపించేలా చేస్తాయి.
* మిక్స్ అండ్ మ్యాచ్...ఇప్పుడిదే హాటెస్ట్ ట్రెండ్. కేవలం దుస్తులే కాదు...జ్యూయలరీ, ఇతర యాక్సెసరీలనూ దానికి భిన్నమైన రంగుల్లో మ్యాచ్ చేసుకోవచ్చన్నమాట. ఉదాహరణకు ప్లెయిన్ లాంగ్ మ్యాక్సీ వేసుకుంటే...అంతగా ఆకట్టుకోదు. ఇలాంటప్పుడు చూడగానే కనిపించే స్టేట్మెంట్ బెల్ట్, చేతికి పెద్ద బ్రాస్లెట్ జత చేసుకుంటే ఆ అందమే వేరు.
* బొహీమియన్ స్టైల్లో మ్యాక్సీలు, పలాజోలు, స్కర్ట్లు, ఎవరికైనా నప్పుతాయి. క్యాజువల్వేర్గా ఇది కలర్ఫుల్గా కనిపించేలా చేస్తుంది. ప్లెయిన్ టాప్స్ మీదకు సిల్వర్ జ్యుయలరీ ఆకట్టుకునేలా చేస్తుంది. రిప్డ్ జీన్స్- ప్రింటెడ్ కాఫ్తాన్, కాఫ్‌లెంగ్త్ జెగ్గింగ్, మినీ ట్యూనిక్ ఇవన్నీ క్యాజువల్ వేర్‌గా బాగుంటాయి. ఇక షార్ట్ టాప్లలో కోల్డ్ షోల్డర్స్, లేయర్స్ బెల్‌బాటమ్, హాఫ్‌స్లీవ్స్ అదరగొట్టేస్తాయి. వీటిమీదకు స్కర్టులనూ ఎంచుకోవచ్చు. లేతరంగుల టీ షర్ట్‌లపై క్విర్కీ ప్రింట్లు బాగుంటాయి. జ్యూతీలు వీటిమీదకు నప్పుతాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
