
తాజా వార్తలు
మామ బర్త్‌డే పార్టీ కోసం..
హైదరాబాద్: దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న సమంత మరోసారి తన సరికొత్త ఫ్యాషన్‌తో నెటిజన్ల చూపులు తన వైపునకు తిప్పుకొన్నారు. తన మామయ్య నాగార్జున పుట్టినరోజు వేడుక కోసం ధరించిన బార్బీ పింక్ డ్రెస్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అక్కినేని ఫ్యామిలీ ఇటీవల విహారయాత్ర కోసం స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లారు. ప్రస్తుతం నాగచైతన్య, సమంత, అఖిల్, నాగార్జున, అమల తదితరులు ఐబిజా ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. నాగ్ గురువారం తన 60వ పుట్టిన రోజును కూడా అక్కడే జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన బర్త్‌డే పార్టీలో సామ్ ప్రత్యేకమైన లుక్‌లో మెరిశారు. పార్టీ కోసం ఆమె వన్-షోల్డర్ షిమ్మర్ డ్రెస్, విలువైన కాస్ట్యూమ్స్ ధరించారు. ఆ లుక్‌లో ఉన్న ఫొటోలను నటి శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీటన్నింటి ధర రూ.2 లక్షలని సమాచారం.
సామ్ ఇటీవల ‘ఓ బేబీ’ సినిమాతో హిట్ అందుకున్నారు. కొరియన్ సినిమా ‘మిస్‌గ్రానీ’కి తెలుగు రీమేక్‌గా దర్శకురాలు నందినిరెడ్డి దీన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆమె తమిళ హిట్ ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో శర్వానంద్ కథానాయకుడు. దిల్‌రాజు నిర్మాత. మాతృకలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- 8 మంది.. 8 గంటలు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
