close

తాజా వార్తలు

ఆ దశలోనూ ఆనందంగా!

మలిదశలో మహిళల్ని మెనోపాజ్‌ లక్షణాలు ఇబ్బందిపెట్టడం మామూలే. వాటినుంచి బయటపడాలంటే... మీవంతుగా ఏం చేయాలో చూడండి.
* ఈ దశలో బరువు పెరగడం మామూలే. దానికితోడు హార్మోన్ల మార్పులు... మరికొన్ని సమస్యలకు దారితీస్తాయి. దీన్ని ముందే అంచనా వేసి... శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. పొద్దున్నే కాసేపు నడక... యోగా, వ్యాయామాల్లాంటివి చేస్తే మార్పు కనిపిస్తుంది.
* చాలామంది పట్టించుకోరు కానీ... మంచినీళ్లూ ఎక్కువగా తాగడం చాలా అవసరం. హార్మోన్ల మార్పుల వల్ల ఎదురయ్యే పొట్ట ఉబ్బరం సమస్య నుంచి బయటపడొచ్చు.
* వీలైనంతవరకూ ప్రాసెస్‌ చేసినవి, తీపి పదార్థాలను తగ్గించాలి. ఇవి మధుమేహం, అధిక రక్తపోటు మొదలు ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి.
* చాలామంది మహిళలు పొద్దున అల్పాహారం తీసుకోరు లేదా మధ్యాహ్నం భోజనం సమయానికి తినరు. ఈ రెండూ ప్రమాదకరమే అంటారు వైద్యులు. ఎన్ని పనులున్నా వేళకు తినడం అలవాటు చేసుకోవాలి.
* మెనోపాజ్‌ అనేది సమస్య కాదు. జీవితంలో ఓ దశ. ఆ లక్షణాలను తలచుకుని భయపడటం కన్నా... వాటినుంచి బయటపడే మార్గాలు వెతుక్కోవాలి. ఈ ఒత్తిడినుంచి బయటపడేందుకు రోజూ కాసేపు ధ్యానం చేస్తే ఫలితం ఉంటుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.