close

తాజా వార్తలు

గూడు కట్టే నాన్న చేప

చుట్టూ తిరిగేస్తుంది... దొరికినవన్నీ తెచ్చేస్తుంది...  నోటితో ఓ దగ్గరకు చేర్చేస్తుంది... ఎంచక్కా గూడు కట్టేస్తుంది... ఇదేదో పక్షి గురించి అనుకుంటున్నారేమో!  కానే కాదండోయ్‌! మరేంటో తెలియాలంటే  ఇది చదివేయండి!

నీళ్లలో అటూ ఇటూ ఈదుతూ తిరిగే చేపల గురించే వినుంటారు. కానీ ఓ చేప ఉంది. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా? నీటిలోపల గూడు కట్టేస్తుంది. పక్షుల్లాంటివి గూళ్లు కడతాయని తెలుసు. మరి చేపేంటీ? నీటిలో గూడు కట్టుకోవడం ఏంటీ? అనిపిస్తోంది కదూ!
* ఈ వింత చేప పేరు త్రీస్పైన్‌డ్‌ స్టికిల్‌ బ్యాక్‌ ఫిష్‌. దీనికి మూడు వెన్నెముకలుంటాయి కాబట్టే ఆ పేరు. ఇంచుమించు మూడు అంగుళాల పొడవుండే బుల్లి చేప ఇది. ఎక్కువగా నదుల్లో, సరస్సుల్లో తిరుగాడేస్తుంది.
* సీహార్స్‌, పైప్‌ఫిష్‌లకు బంధువు.
* ఎక్కువగా ఉత్తరార్ధగోళంలోనే కనిపించే ఇవి మంచినీటిలోనూ ఉప్పునీటిలోనూ బతికేస్తుంటాయి.
* గోధుమ, సిల్వర్‌ రంగుల్లో మెరిసిపోతూ ఉంటాయి. మగ చేపలు మాత్రం అక్కడక్కడ ఎరుపు, నారింజ, పసుపు రంగులతో కనిపిస్తాయి. జతను ఆకట్టుకోవడానికే దీనికి ఈ ప్రత్యేక రంగులెండి.
* ఇక అసలు విషయానికి వస్తే... ఈ చేపల్లో పిల్లల బాధ్యత అంతా మగ చేపలదే. నీటి లోపలున్న నాచు, ఆకులూ అలముల్లాంటి వాటిని నోటితో నెమ్మదిగా ఏరుకుని ఓ దగ్గరకు చేరుస్తాయి. ఆ తర్వాత సన్నని పోగుల్లా జిగురు ద్రవాన్ని స్రవించి అన్నింటిని కలిపి గూడు కట్టేస్తాయి. ఆడ చేపలు ఆ గూటిలో గుడ్లు పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతాయి. అలా ఒక్కోటి 200 గుడ్ల వరకు పెడుతుంది.
* గూటిలో గుడ్లు పెట్టిన దగ్గర్నుంచి అవి పొదిగే వరకూ బాధ్యత అంతా మగ చేపలే చూసుకుంటాయి. పగలూరాత్రీ గూటికి కాపలా ఉంటూ కేర్‌టేకర్లుగా మారుతాయి.
* అలా చేప పిల్లలు వాటంతటవే బయటకు వచ్చేవరకూ కంటికి రెప్పలా కాపాడేస్తాయన్నమాట.
* పురుగుల లార్వాల్ని, చిన్న నత్తల్ని తిని కడుపు నింపుకొంటాయివి. వీటి జీవిత కాలం మూడు నుంచి ఐదు సంవత్సరాలు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.