
తాజా వార్తలు
సొంత వ్యక్తిత్వం పెంచుకోకుండా ఇతరులతో తమను పోల్చుకుంటారు కొందరు. అదే వద్దంటారు మానసిక నిపుణులు. ఈ తీరుని ఎలా మార్చుకోవాలో చూడండి మరి.
*విశ్లేషణ: ఏయే విషయాల్లో మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకుంటున్నారో గమనించుకుని, విశ్లేషించుకోండి. అవతలివారి ప్రత్యేకతలు తెలుస్తాయి. అవి మీలో ఎంతవరకూ ఉన్నాయో ఆలోచించుకుని... మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి.
* మీకు మీరే: మీలోని బలాల్ని గుర్తించండి. కుదిరితే వాటన్నింటినీ ఓ చోట రాసుకోండి. ఈ చిన్న ప్రయత్నం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏదయినా చేయగలరనే ధైర్యాన్ని ఇస్తుంది.
* ఆనందించండి: తోటి స్నేహితులు లేదా సహోద్యోగుల విజయాలను చూసి ఆనందించడం అలవాటు చేసుకోండి. లేదంటే ఇది అసూయగా మారి...చివరకు ఆత్మన్యూనతకు దారి తీస్తుంది.
* స్ఫూర్తి అవసరం: మెంటార్ అందించే సలహాలు... స్ఫూర్తి... ఎప్పుడయినా ఉపయోగపడతాయి. మీకంటూ ఓ మెంటార్ని పెట్టుకోండి. తరచూ వారితో మాట్లాడండి. ఆ వ్యక్తి అనుభవాలు, సూచనలు మీ ఉన్నతికి తోడ్పడతాయి.
* నైపుణ్యాలు పెంచుకునేలా: మనలోని అర్హతలు సైతం... మనకంటూ ఓ గుర్తింపు తెస్తాయి. ఆ దిశగా మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి. చదువొక్కటే కాదు... మీరెంచుకున్న రంగానికి సంబంధించిన ఇతర నైపుణ్యాలపై పట్టు సాధించండి. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అలవర్చుకోండి. నలుగురిలో ధైర్యంగా మాట్లాడేలా చూసుకోండి. మీరెంచుకున్న రంగంలో వస్తోన్న మార్పులను తెలుసుకుని ముందుకు సాగండి. మీరు సాధించిన విజయం చిన్నదైనా ఎప్పటికప్పుడు రాసుకోండి. వాటిని అప్పుడప్పుడూ చదువుకుంటే మీ సామర్థ్యాలు మీకు తెలుస్తాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- శరణార్థులకు పౌరసత్వం
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
