close

తాజా వార్తలు

కుల్‌భూషణ్‌ కేసులో నేటి నుంచి ఐసీజే విచారణ

ది హేగ్‌: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) సోమవారం నుంచి నాలుగు రోజులపాటు వాదనలు ఆలకించనుంది. తొలిరోజు మనదేశం వాదనలు వినిపిస్తుంది. 19న పాక్‌కు ఆ అవకాశం లభిస్తుంది. తిరిగి 20న మనదేశం స్పందించాక, 21న పొరుగుదేశం తుది వాదనలు వినిపిస్తుంది. ఐసీజేలో భారత్‌కు మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే ప్రాతినిధ్యం వహించే అవకాశముంది. పాక్‌ తరఫున బారిస్టర్‌ ఖావర్‌ ఖురేషి వాదనలు వినిపిస్తారు. ఈ ఏడాది వేసవిలోగా తుది తీర్పు వెలువడుతుందని అంచనా. జాదవ్‌ భారత నౌకాదళ మాజీ అధికారి. ఉగ్రవాదం, గూఢచర్య ఆరోపణలపై పాక్‌లోని సైనిక కోర్టు ఒకటి 2017 ఏప్రిల్‌లో ఆయనకు మరణ శిక్ష ఖరారు చేసింది. తీర్పుపై మనదేశం ఐసీజేను ఆశ్రయించింది. తుది తీర్పు వెలువడేంత వరకు జాదవ్‌ మరణ శిక్షను అమలు చేయకుండా అదే ఏడాది మే 18న పాక్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. పుల్వామా ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో తాజా విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.