close

తాజా వార్తలు

వయసు పెరిగే కొద్ది పాత మందులా తయారవుతున్నారు

హర్బజన్‌, ఇమ్రాన్‌లను ఉద్దేశించి ధోనీ వ్యాఖ్యలు

చెన్నై: చెన్నై సూపర్‌ స్పిన్‌ ద్వయం హర్భజన్‌సింగ్‌, ఇమ్రాన్‌ తాహిర్‌ వయసు పెరిగేకొద్దీ పాత మందులా తయారౌతున్నారని చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అన్నాడు. మంగళవారం చెన్నై, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో వారిద్దరూ చెరో రెండు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో వారి ప్రదర్శనపై ధోనీ పై వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ‘వారిద్దరికీ వయసు మీదపడుతోంది. పెరిగేకొద్దీ వాళ్లు పాత మందులా మారుతున్నారు. భజ్జీ ఆడిన మ్యాచుల్లో మంచి ప్రదర్శన చేశాడు. నాకు అవసరమైనప్పుడల్లా ఇమ్రాన్‌ తాహిర్‌ సహకారం తీసుకున్నాను. అతడు నా అంచనాలకు తగ్గట్టుగా ఆడుతున్నాడు’ అని పేర్కొన్నాడు.

మొత్తం మీద చెన్నై బౌలింగ్‌ విభాగం బాగుందని కితాబిచ్చాడు. ఒకసారి ఫ్లాట్‌ వికెట్‌పై మంచిగా ఆడితే కానీ తమ జట్టు కూర్పుపై స్పష్టత వస్తుందని చెప్పాడు. చెన్నై అభిమానుల మద్దతు గురించి మీడియా ప్రశ్నించగా అందుకు బదులిస్తూ.. ఇక్కడ చాలా కాలంగా క్రికెట్‌ ఆడుతున్నా. చెన్నైలో నాకు చాలా మంచి విషయాలు జరిగాయి. నా టెస్టు అరంగేట్రం కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడి అభిమానులు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మంచి మద్దతు ఇస్తారు. ఇదొక ప్రత్యేక అభిమానం వాళ్లు నన్ను తమవాడిగా ఆదరిస్తారు’ అని చెప్పుకొచ్చాడు. 

ఇదిలా ఉండగా చెపాక్‌ పిచ్‌పై ధోనీ మరోసారి తన అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి నెమ్మది పిచ్‌లపై పరుగులు తీయడం చాలా కష్టమని తెలిపాడు. పిచ్‌ గురించి ఆందోళన చెందినా మ్యాచ్‌ గెలవడం సంతోషంగా ఉందన్నాడు. మరోవైపు డ్వాన్‌ బ్రావో, డేవిడ్‌ విలే జట్టుకు దూరమవ్వడం కాస్త కష్టతరంగా ఉందని, వారు లేకపోతే జట్టులో ఆల్‌రౌండర్‌ కూర్పు సరిగ్గా లేదని వాపోయాడు. ఇక బౌలర్లకు సూచనలివ్వడంపై మాట్లాడుతూ.. బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడుతున్నాడో బౌలర్లకు చెప్పి అందుకు తగ్గట్టు బంతులేయమని చెబుతానని ధోనీ అన్నాడు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.