close

తాజా వార్తలు

ఈసారి వర్షపాతం దాదాపు సాధారణమే


దిల్లీ:  నైరుతి రుతుపవనాల ద్వారా ఈసారి దేశంలో దాదాపు సాధారణ వర్షపాతమే నమోదు కానుంది. ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చనే వార్తల నేపథ్యంలో జూన్‌-సెప్టెంబరులో సాధారణ వర్షపాతం దీర్ఘకాల సగటులో 96 శాతంగా ఉండనుందని భారత వాతావరణ విభాగం  సోమవారం వెల్లడించింది. ఈ అంచనాల్లో ఐదు శాతం అటూ ఇటూగా ఉండొచ్చని ఆ విభాగం వెల్లడించింది. వ్యవసాయాధారిత దేశమైన భారత్‌లో సగం కంటే ఎక్కువ ప్రాంతం ఈ రుతుపవనాల మీదే ఆధారపడుతుంది.  ఈ నాలుగు నెలల్లోనే మొత్తం వర్షపాతంలో  70 శాతం వర్షపాతాన్ని పొందుతుంది. ఇది ప్రజల జీవనోపాధి, ఆహార ధరల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.