
తాజా వార్తలు
తల్లిదండ్రులు, ప్రజాసంఘాల డిమాండ్
ఇంటర్నెట్ డెస్క్: పబ్జీ, టిక్‌టాక్, హాలో, విపోసో వంటి యాప్‌లు వినోదమే ప్రధానంగా మొబైల్‌లోకి ఎక్కించేస్తున్నారు నేటి యువత. వినోదం పేరుతో గంటల కొద్ది పిల్లలు జ్ఞాన సముపార్జన చేసే సమయాన్ని ఆ యాప్‌లతో కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారు. అదే పనిగా వీడియోలు చూడడం, వాటిని అనునయించడం, చేసిన వీడియోలను స్నేహితులతో పంచుకుని ఆనందిస్తున్నారు. వీడియో గేమ్‌ల్లో పూర్తి చేసే టాస్క్‌ల మాదిరిగా బయట నిజ జీవితంలో కూడా ప్రవర్తించడం పిల్లల ప్రాణాల మీదకు తీసుకువస్తుంది. ఈ విధంగా పబ్జీ, బ్లూ వేల్ వంటి గేమ్‌లకు బానిసై ప్రాణాలు కోల్పోయి ఘటనలు ప్రాంతాలకు అతీతంగా జరుగుతున్నాయి.
తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లడం, పిల్లల్లో శారీరక శ్రమ తగ్గి మైదానాల్లో ఆటపాటలు వదిలి వీడియో గేమ్‌ల మోజులో పడి కాలాన్ని, మేధస్సును దుర్వినియోగం చేసుకుంటున్నారు. 4జీ మొబైల్ ఫోన్లు, అంతర్జాలం తక్కువ ధరకే లభ్యమవ్వడం తల్లిదండ్రుల పర్యవేక్షణ తగ్గడం, పిల్లలను ఇటువంటి వాటికి వ్యసనపరులుగా మారుస్తున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలకు త్రిలోదకాలు ఇస్తున్న వైనంపై ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు వీటిని నిషేధించాలని ఉద్యమిస్తున్నాయి. ఫలితంగా మద్రాస్ హైకోర్టు సూచనలతో టిక్‌టాక్ నిషేధానికి గురవ్వగా.. పబ్జీ గేమ్‌పైనా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా బాంబే హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటికే గుజరాత్ సహా నేపాల్‌లో పబ్జీని నిషేధించారు. టిక్‌టాక్ యాప్‌లా పబ్జీని దేశవ్యాప్తంగా నిషేధించాలని తల్లిదండ్రుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతర్జాలం విజ్ఞానంతోపాటు వినాశనానికి దాన్ని ఏ మేర వాడాలో పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
వినోదం ఉపశమనం కోసం ఆడడం మంచిదేనని.. కానీ హద్దులు దాటి ఆడకుండా నియంత్రించకుంటే మంచిదని ఆన్లైన్ గేమ్ యూజర్లు అంటున్నారు. ఆన్లైన్ గేమింగ్ పసిపిల్లలు బలైపోవడం బాధాకరమని సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీస్ స్టడీస్ డైరెక్టర్ రమేష్ బాబు అన్నారు. సైబర్ భద్రత ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమాచార, ఐటీ, హోం, ఇంటిలిజెన్స్ హోం శాఖలు సమన్వయంతో ఇటువంటి వినాశకర సాంకేతికతను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మైండ్ గేమ్‌లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు పిల్లలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- 8 మంది.. 8 గంటలు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
