close

తాజా వార్తలు

ఫైనల్‌కి చేరిన ముంబయి ఇండియన్స్‌

ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపు

చెన్నై: చెపాక్‌ వేదికగా ఐపీఎల్‌ 12వ సీజన్‌ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను మట్టికరిపించి ముంబయి ఫైనల్‌ చేరింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును సూర్యకుమార్‌ యాదవ్‌(71; 54 బంతుల్లో 10x4), ఇషాన్‌ కిషన్‌(28, 31 బంతుల్లో 1x4, 1x6) ఆదుకున్నారు. వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడి మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జట్టు స్కోర్‌ 101 పరుగుల వద్ద.. ఇమ్రాన్‌ తాహిర్‌ వరుస బంతుల్లో ఇషాన్‌, కృనాల్‌ పాండ్యలను ఔట్‌చేశాడు. చివర్లో హార్దిక్‌ పాండ్య(13; 11 బంతుల్లో 1x4), సూర్యకుమార్‌ నిలకడగా ఆడి 18.3 ఓవర్లలో ముంబయిని విజయతీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో ఇమ్రాన్‌ తాహిర్‌ రెండు వికెట్లు తీయగా దీపక్‌ చాహర్‌, హర్భజన్‌ చెరో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై సూపర్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అంబటిరాయుడు (42; 37 బంతుల్లో 3x4, 1x6), ధోనీ(37; 29 బంతుల్లో 3x6) బాధ్యతాయుతంగా ఆడి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలుత 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుని మురళీవిజయ్‌(26; 26 బంతుల్లో 3x4), రాయుడు ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 12వ ఓవర్‌లో జట్టు స్కోర్‌ 65 పరుగుల వద్ద విజయ్‌ ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ, రాయుడితో కలిసి జట్టు స్కోరును 130 పరుగులు దాటించాడు. ముంబయి బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ రెండు వికెట్లు తీయగా కృనాల్‌ పాండ్య, జయంత్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.