
తాజా వార్తలు
భోపాల్: సాధారణంగా పార్టీ మేనిఫెస్టోనే ప్రజల్లోకి తీసుకెళ్తూ అభ్యర్థులు ఓట్లను అభ్యర్థిస్తారు. కాని భోపాల్ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రజ్ఞా సింగ్ థాకూర్ మాత్రం తన సొంత మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు. దానిలో విద్యార్థులు, మహిళలు, దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, వాటికి పరిష్కారం చూపుతానని ఆమె అన్నారు. నియోజకవర్గంలో చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయని, వాటన్నిటినీ కలిపి మరో పూర్తిస్థాయి మేనిఫెస్టోను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. భోపాల్లో చాలా చోట్ల కారు వెళ్లడానికి కూడా వీలు లేని విధంగా రోడ్లు ఉన్నాయన్నారు. అలాంటి చిన్న వీధుల్లో నివసిస్తున్న ప్రజలను కలవాలంటే నడుచుకుంటూనో లేదా ద్విచక్ర వాహనంపైనో మాత్రమే వెళ్లగలమని అన్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో తనని నిందితురాలిగా పేర్కొంటూ కాంగ్రెస్ వాళ్లు ఎన్నో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. అందువల్లే నడవలేకపోతున్నానని, నేటి నుంచి ద్విచక్ర వాహనంపైనే ప్రచారానికి వెళ్లనున్నట్లు నియోజకవర్గ ప్రజలకు తెలియజేశారు. అయితే ఆరో విడతలో మే 12నే భోపాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికలు జరిగే రోజుకు 48 గంటల ముందు నుంచీ ఎన్నికల ప్రచారం చేయకూడదు. వీటన్నిటినీ పరిశీలిస్తే ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగలడం గమనార్హం.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
