close

తాజా వార్తలు

భార్య తల నరికి.. ప్లాస్టిక్‌ కవర్లో పెట్టి..

భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త 
తల నరికి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన వైనం

 కలకడ: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం అనోన్యంగా జీవించారు. ప్రతిరూపాలుగా వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. మధ్యలో ఇద్దరికీ మనస్పర్థలు వచ్చాయి. భార్య పుట్టింటికి వెళ్లింది. భర్తతో కాపురానికి రాలేదు. భర్త, భార్య దగ్గరకు వచ్చివెళుతూ ఉండేవాడు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెరిగింది. ప్రవర్తన సరిగాలేదని ఇంటికి కాపురానికి రాలేదని భార్యపై కోపం పెంచుకున్నాడు. చివరకు కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఆమెకు అనుమానం రాకుండా అక్కడే ఉంటూ పథకం ప్రకారం భార్యను ద్విచక్ర వాహనంతో తీసుకొస్తూ మార్గమధ్యంలో కొడవలితో కిరాతకంగా నరికి చంపాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కలకడ మండలంలోని కలకడ-గుర్రకొండ మార్గంలో కదిరాయచెర్వు వడ్డెపల్లె సమీపంలోని కుంటలో మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. 
కడప జిల్లా సంబేపల్లె మండలం దేవపట్ల పంచాయతీ అసన్‌జీవాండ్లపల్లెకు చెందిన హుస్సేన్‌ కుమారుడు హుస్సేనయ్య చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం మర్రిపాడు కాలనీకి చెందిన రసూల్‌సాబ్‌ రెడ్డి కుమార్తె నాగూర్‌అమ్మాజీ(27)ని తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. వీరికి కుమారుడు నాసీర్‌(7), కుమార్తె లడ్డు(5) ఉన్నారు. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. అక్కడే ఆశా కార్యకర్తగా పని చేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. హుస్సేనయ్య లారీ డ్రైవర్‌గా పని చేస్తూ అప్పుడప్పుడు భార్య దగ్గరకు వచ్చి వెళ్తుండేవాడు. అతను సంపాదించిన ఆదాయాన్ని ఆమెకు ఇచ్చేవాడు. భార్యను పలుమార్లు తన ఇంటికి కాపురానికి రమ్మని పిలిచినా రాలేదని, అక్కడే ఉండటంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. డబ్బులు తీసుకెళితేనే దగ్గరకు రానిస్తుండడంతో తన దారిలోకి రాలేదని కక్షగట్టాడు. భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ముందస్తుగా పథకం వేసుకున్నాడు. 15 రోజుల క్రితం మర్రిపాడులో ఉన్న భార్య దగ్గరకు వెళ్లాడు. ‘మన ఇంటికి వెళ్దాం రా.. డబ్బులు ఉన్నాయి.. తీసుకొని వద్దాం..’ అని చెప్పి భార్యను నమ్మించి.. ఇద్దరూ ద్విచక్ర వాహనంలో దేవపట్ల అసన్‌జీవాండ్లపల్లెకు బయలుదేరారు. పథకం ప్రకారం ముందుగానే కొడవలిని సిద్ధం చేసుకున్నాడు. కదిరాయచెర్వు సమీపంలోకి రాగానే మూత్రవిసర్జన చేయాలని కుంటవద్దకు తీసుకెళ్లాడు. అక్కడే తనతో తెచ్చుకున్న కొడవలితో తలను నరికి ప్లాస్టిక్‌ కవర్లో పెట్టుకొని నేరుగా పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఎస్సై వంశీధర్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, వాల్మీకిపురం సీఐ ఉలసయ్య ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. సీఐ ఉలసయ్య కేసు నమోదు చేశారు. 

హత్య జరిగిన విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకొని న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. హత్యతో వారి పిల్లలు తల్లి లేనివారయ్యారు. ఈ ఘటన మండలంలో కలకలం సృష్టించింది. విషయం తెలియడంతో సమీప గ్రామాల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకొని జరిగిన విషయం తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేశారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.