
తాజా వార్తలు
న్యూదిల్లీ: జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైన విషయం తెలిసిందే. బుధవారం దేశంలోని పలు పార్టీల అధినేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంపై కూడా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ విధానం దేశానికి ముఖ్యమని అన్నారు. ‘‘దేశానికి ఈ ఎన్నికలు అవసరం. దేశంలో చాలా పార్టీలున్నాయి. అన్ని పార్టీల నుంచి అంగీకారం వస్తే అది దేశానికే లబ్ధి చేకూర్చుతుంది. ఇటీవల లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. మళ్లీ త్వరలోనే నాలుగైదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.
అఖిలపక్ష సమావేశానికి కొన్ని పార్టీల అధినేతలు గైర్హాజరైన విషయంపై నఖ్వీ స్పందిస్తూ... ‘‘సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకోవడం అది వారికి సంబంధించిన సమస్య. అన్ని పార్టీలతో చర్చలు జరపడం తప్పనిసరి. తమ అభిప్రాయాలను తెలపడానికి ఇది రాజకీయ పార్టీలకు వచ్చిన ఓ గొప్ప అవకాశం’’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ సమావేశానికి టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు పలు పార్టీల అధి నేతలు హాజరుకాలేదు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- శరణార్థులకు పౌరసత్వం
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
