
తాజా వార్తలు
ఆటగాళ్ల భ్రదతే అత్యంత ప్రాముఖ్యం: బీసీసీఐ
లండన్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం శ్రీలంకతో ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతున్న వేళ భారత్‌కు వ్యతిరేకంగా ‘జస్టిస్ ఫర్ కశ్మీర్’ అనే ప్రచారంతో గాల్లో విమానాలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐసీసీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. మ్యాచ్ జరగుతుండగా మూడుసార్లు గుర్తు తెలియని విమానాలు భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ గాల్లో చక్కర్లు కొట్టాయి.
‘ఎట్టిపరిస్థితుల్లో ఇలాంటి ఘటనలను ఉపేక్షించలేము. ఆటగాళ్ల భద్రపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐసీసీకి ఫిర్యాదు చేశాం. సెమీఫైనల్స్‌లోనూ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే అంతకన్నా దురదృష్టకరం మరోటి ఉండదు. ఆటగాళ్ల భద్రతా ప్రమాణాలే మాకు అత్యంత ముఖ్యం’ అని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి వివరించారు. ‘మళ్లీ ఇలా జరగడం ఏమాత్రం బాగోలేదు. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్ సమయంలో రాజకీయ సందేశాలను సహించబోమ’ని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
స్థానిక పోలీసులతో మాట్లాడి ఇలాంటి ఘటనలు పునరావృతమవ్వకుండా చూస్తామని ఐసీసీ హామీఇచ్చింది. అలాగే సెమీఫైనల్స్ సందర్భంగా మాంచెస్టర్, బర్మింగ్‌హామ్‌లోని స్టేడియాలపై విమానాల రాకపోకలను నిషేధించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపింది. కాగా ఇదివరకు పాకిస్థాన్ X అఫ్గానిస్థాన్ మ్యాచ్ సందర్భంగానూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ‘ఫ్రీ బలోచిస్థాన్’ అనే బ్యానర్‌తో విమానం చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వాట్సప్‌లో కాల్ వెయిటింగ్ ఫీచర్
- తెలుగువాళ్లందరికీ నేను వెంకీ మామనే: వెంకటేష్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
