
తాజా వార్తలు
జోహన్స్‌బర్గ్: తన అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంపై నెలకొన్న వివాదంపై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ నోరు విప్పాడు. ప్రపంచకప్‌లో ఆడాలని జట్టు ఎంపిక చేసే ముందు రోజు సాయంత్రం తానేమీ డిమాండ్, ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశాడు. రిటైర్మెంట్ తర్వాత డబ్బు కోసమే వివిధ లీగుల్లో ఆడుతున్నాడని వస్తున్న విమర్శలకు ఏబీ ఘాటుగా సమాధానం చెప్పాడు.
బోర్డుతో సంబంధాల్లేవు
‘నేనేమీ డిమాండ్ చేయలేదు. టోర్నీకి ముందు ప్రపంచకప్ ఆడతానని ఒత్తిడి చేయలేదు. ఎంపిక చేయాలని ఆశించలేదు కూడా. నా వైపు నుంచి ఎలాంటి తప్పులేదు. అన్యాయానికి తావులేదు. వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ సౌతాఫ్రికాతో, జట్టుతో నాకసలు అధికారి సంబంధాలు లేవు. నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. ఒటిస్ గిబ్సన్, ఉత్తమమైన డుప్లెసిస్ సారథ్యంలో సఫారీలు ముందుకు వెళ్లాలని కోరుకున్నా’ అని డివిలియర్స్ అన్నాడు.
అప్పుడు చెప్పిందే మళ్లీ చెప్పా
డివిలియర్స్, డుప్లెసిస్ పాఠశాల నుంచే మంచి మిత్రులు. జట్టుకు అవసరమైతేనే అందుబాటులో ఉంటానని వీడ్కోలు సమయంలోనే డుప్లెసిస్‌కు స్పష్టం చేశానని ఏబీ చెప్పాడు. ‘మేమిద్దరం పాఠశాల నుంచే మంచి స్నేహితులం. ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక చేసే రెండు రోజుల ముందు అతడితో సాధారణంగా మాట్లాడాను. ఐపీఎల్లో మంచి ఫామ్‌లో ఉన్నాను. అందుకే ఏడాది ముందు చెప్పినట్టే అవసరమైతేనే.. కేవలం అవసరమైతేనే అందుబాటులో ఉంటానని మామూలుగా చెప్పా. టీమిండియా చేతిలో పరాజయం, మూడు ఓటముల తర్వాత మా వ్యక్తిగత సంభాషణను ఎవరో మీడియాకు చెప్పారు. నా పై చెడు అభిప్రాయం ఏర్పడేలా చేశారు’ అని ఏబీ తెలిపాడు.
ఎవరో తెలీదు
‘ఆ కథనాన్ని నేను గానీ, నాతో అనుబంధం ఉన్న వారుగానీ, డుప్లెసిస్ గానీ బయటకు చెప్పలేదు. నా పై విమర్శలు రావాలని కోరుకున్నవారే చేశారు. ఫలితంగా దురహంకారిగా, స్వార్థపరుడిగా, సందేహపరుడిగా ముద్రవేశారు. నేను సవినయంగా చెబుతున్నది ఒక్కటే, నా నిర్ణయంపై స్పష్టతతో ఉన్నా. సహేతుక కారణాలతోనే వీడ్కోలు పలికా. ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉంటావా అన్నప్పుడు తలుపులు తెరిచే ఉంచా. ఏదేమైనప్పటికీ జట్టు ప్రయాణం కొనసాగించింది. సమస్యేం లేదు. ఎవరిపై నాకేం కోపం లేదు’ అని మిస్టర్ 360 వెల్లడించాడు.
ఎన్నో వదులుకున్నా
‘నాకు డబ్బు సంపాదనే లక్ష్యమని కొందరు అన్నారు. వారి అభిప్రాయం తప్పు. ప్రపంచ వ్యాప్తంగా ఆడేందుకు వచ్చిన ఎన్నో లాభదాయక అవకాశాలను వదులుకున్నా. కుటుంబంతో ఉండేందుకు బయట ఏడాదికి ఎనిమిది నెలలు గడిపే బదులు మూడు నెలలకు కుదించుకున్నా. ఇప్పటికీ నా కుటుంబంతో గడుపుతూ దక్షిణాఫ్రికాలో, ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన టీ20 టోర్నీల్లో కొనసాగాలని కోరుకుంటున్నా. దేశం తరఫున ఆడినందుకు, సారథిగా ఉన్నందుకు గర్వపడుతున్నా. దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో నా సంబంధాలు ఎప్పటి కన్నా ఇంకా బలంగా ఉంటాయి. తర్వాతి తరానికి సాయం చేసేందుకు నేనెప్పుడూ సిద్ధమే’ అని ఏబీ ఆవేదన చెందాడు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
