close

తాజా వార్తలు

సిద్ధార్థ మరణంపై దీదీ వరస ట్వీట్లు

కోల్‌కతా: కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ విషాద మరణం అత్యంత దురదృష్టకరమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ట్విటర్ వేదికగా భాజపా, ఎన్డీఏ ప్రభుత్వం పేర్లు ప్రస్తావించకుండా ఆర్థిక వ్యవస్థ, దర్యాప్తు సంస్థల పనితీరుపై విమర్శలు చేశారు. మీరు శాంతియుతంగా పాలిస్తేనే ప్రజలు విశ్వాసంతో జీవిస్తారని సూచించారు. 

‘వీజీ సిద్ధార్థ మరణం తీవ్రమైన షాక్‌కు గురిచేసింది. ఆ ఘటన దురదృష్టకరం. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం వివిధ సంస్థల నుంచి ఆయన వేధింపులు ఎదుర్కోవడంతో ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ప్రశాంత వాతావరణంలో ఆయన వ్యాపారాన్ని నిర్వహించలేకపోయుండొచ్చు. వేధింపులను ఆయన అడ్డుకోలేకపోయారు. నేను చాలామంది దగ్గరి నుంచి విన్నదాని ప్రకారం ఇలాగే అనేక పరిశ్రమల యజమానులు ఒత్తిడితో ఉన్నారు. కొంతమంది దేశాన్ని విడిచి వెళ్లిపోతుంటే, మరికొంతమంది వాటిని నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. విపక్ష నాయకులు కూడా కొనుగోలు, వేధింపులతో భయాందోళనలకు గురవుతున్నారు. 

ఒకవైపు దేశ ఆర్థిక వృద్ధి రేటు గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే అతి తక్కువగా నమోదైంది. నిరుద్యోగిత గత 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగింది. 

మరోవైపు ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు నుంచి బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిరిండియా నుంచి చిత్తరంజన్‌ లోకోమోటివ్ వర్క్స్‌ , దుర్గాపూర్‌లోని అల్లాయ్‌ స్టీల్ ప్లాంట్‌ వరకు  సుమారు 45 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసింది.  మొత్తంగా ఆర్థిక వ్యవస్థ సరైన స్థితిలో లేకపోవడంతో సామాన్య ప్రజలు బాధలకు గురవుతున్నారు. 

పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి కల్పనే మన దేశ భవిష్యత్తు. పరిశ్రమలు స్థైర్యాన్ని కోల్పోతే ఆర్థికంగా, ఉద్యోగపరంగా ఎలాంటి వృద్ధి ఉండదు. దాని ఫలితంగా నిరుద్యోగిత పెరిగిపోతుంది. 
మీరు శాంతియుతంగా పనిచేస్తేనే, రాజకీయాలు, దర్యాప్తు సంస్థల నుంచి దేశ భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం లేదన్న విశ్వాసంతో ప్రజలు జీవించగలరని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సిద్ధార్థ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ వార్త విని చాలా విచారానికి గురయ్యాను. ఆయన మృతి నేపథ్యంలో నా ఆలోచనలు, భావాలను మీతో పంచుకోవాలనుకున్నాను’ అని వరస ట్వీట్లు చేశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.