
తాజా వార్తలు
దిల్లీ: కశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్ సిద్ధంగా ఉందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. కశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్ చివరకు అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ ఆశ్రయిస్తామని మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అక్బరుద్దీన్ స్పందిస్తూ..‘‘వారు(పాక్) వివిధ వేదికలపై మనల్ని ఎదుర్కోవాలని భావిస్తే.. అదే వేదికలపై వాటిని తిప్పికొట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం. వారు ఇప్పుడు ఐసీజేకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఓసారి ప్రయత్నించి విఫలమయ్యారు’’ అని అక్బరుద్దీన్ ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా గత వారం కశ్మీర్‌పై ఐరాస భద్రతా మండలిలో జరిగిన సమావేశాన్ని అక్బరుద్దీన్ ప్రస్తావించారు. అవి కేవలం రహస్య సంప్రదింపులేనని స్పష్టం చేశారు. అదే భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ మద్దతు ఉందనడాకి నిదర్శనమని వివరించారు. అలాగే కుల్‌భూషణ్ విషయంలో ఐసీజేలో భారత్ దౌత్యపరంగా పై చేయి సాధించిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.
కశ్మీర్ విషయంలో ఐసీజేని ఆశ్రయిస్తామని పాకిస్థాన్ మంగళవారం పేర్కొంది. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన నేపథ్యంలో రకరకాల వేదికలపై యాగీ చేయడానికి ప్రయత్నిస్తున్న పొరుగుదేశం చివరకు అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ వదలకపోవడం గమనార్హం. ‘‘కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించాం’’ అని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ మంగళవారం వెల్లడించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
