close

తాజా వార్తలు

‘అక్కినేని’ జాలీ ట్రిప్‌లో కొత్త ఫొటోలు

హైదరాబాద్‌: వారం రోజుల పాటు స్పెయిన్‌ టూర్‌లో ఉన్న అక్కినేని కుటుంబం హైదరాబాద్‌కు చేరుకుంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సమంత సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా విహారయాత్రకు సంబంధించిన కొన్ని కొత్త ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 

అక్కినేని కుటుంబసభ్యులందరూ కలిసి దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ..  ‘అందమైన జ్ఞాపకాలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. దీంతోపాటు మెటాలిక్‌ బెలూన్లతో వయ్యారంగా నిల్చున్న తన ఫొటోను కూడా షేర్‌ చేశారు. ఈ ఫొటోలో సమంత అద్దాలతో అలంకరించిన నలుపు రంగు డ్రెస్‌ను ధరించారు. ఈ చిత్రం అక్కినేని అభిమానులనే కాకుండా ఫ్యాషన్‌ ప్రియులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇంతకుముందు కూడా సమంత షేర్‌ చేసిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. 

ప్రస్తుతం సమంత తమిళ సినిమా ‘96’ రీమేక్‌లో నటిస్తున్నారు. మరోవైపు నాగచైతన్య శేఖర్‌కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో కనిపించనున్నారు. నాగార్జున బిగ్‌బాస్‌-3 షోతో బిజీగా ఉన్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.