close

తాజా వార్తలు

సీఐఐతో జట్టుకట్టనున్న ఐఐటీ మద్రాస్‌

న్యూదిల్లీ: ఇండియాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌తో జట్టు కట్టనుంది. సృజనాత్మకమై పర్యావరణహిత స్టార్టప్‌లను ప్రమోట్‌, వృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకొంది. ఐఐటీ మద్రాస్‌లోని గోపికృష్ణన్‌-దేశ్‌పాండే సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌  ఈమేరకు సీఐఐ-సోహ్రాబ్జీ గోద్రెజ్‌ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ ఒక ఒప్పందం చేసుకొంది. దీనిలో భాగంగా గోపికృష్ణ-దేశ్‌పాండే సెంటర్‌ దేశంలోని వివిధ విద్యా సంస్థల్లో కాలుష్య రహిత టెక్నాలజీని వృద్ధి చేసేందుకు  వచ్చే వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తుంది. ఈ స్టార్టప్‌లకు సీఐఐ వ్యాపారం, విస్తరణ అంశాల్లో సహకారం అందజేస్తుంది. 
‘‘మా అనుభవం ప్రకారం ఐఐటీలు, ఇతర సంస్థల నుంచి క్లీన్‌ టెక్‌, గ్రీన్‌ బిజినెస్‌కు సంబంధించి వచ్చే ఆలోచనల్లో 20-25శాతం ఉపయోగపడేవికాదు.’’ అని గోపికృష్ణ-దేశ్‌పాండే సెంటర్‌ సీఈవో ఆర్‌ రఘోత్తమరావు తెలిపారు.  ఇప్పుడు సీఐఐతో ఎంవోయూ కుదరడంతో మరింత బలమైన స్టార్టప్‌లను ప్రారంభించేందుకు అవకాశం ఉంది. ఈ ఆలోచనలను పరిశ్రమ అవసరాలకు తగిటన్లు ఉన్నాయోలేదో చూసుకొనే వెసులుబాటు లభిస్తుంది. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.