
తాజా వార్తలు
ముంబయి: టీమిండియా యువ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్‌పంత్ తన తప్పులను తెలుసుకోవాలని ఆసీస్ మాజీ దిగ్గజం డీన్ జోన్స్ సూచించారు. ఆటను త్వరగా మెరుగు పరుచుకోవాలని కోరారు. పంత్ స్వభావాన్ని అర్థంచేసుకొని అతడి నుంచి ఫలితాలు రాబట్టాలన్న యువరాజ్‌సింగ్ అభిప్రాయంతో విభేదించారు. క్రికెట్‌ను పెద్దోళ్ల ఆటగా వర్ణించిన ఆయన పంత్ ఆఫ్‌సైడ్ ఆట మెరుగు పరుచుకోవాలని సలహా ఇచ్చారు.
‘పొరపాట్లు చేసిన ఇతర యువ ఆటగాళ్ల కన్నా పంత్ ఎలా భిన్నం అవుతాడు? ఇది పెద్దోళ్ల క్రికెట్. అతడు కుర్రాడని నాకు తెలుసు. కానీ అతడు పొరపాట్ల నుంచి త్వరగా నేర్చుకోవాలి. తన ఆఫ్‌సైడ్ ఆటను మెరుగుపర్చుకోవాలి’ అని డీన్‌జోన్స్ ట్వీట్ చేశారు. పంత్‌పై యువరాజ్‌సింగ్ అభిప్రాయాన్ని ట్యాగ్ చేశారు.
‘పంత్ స్వభావాన్ని బట్టి అతడి నుంచి ఫలితాలు రాబట్టాలి. అతడి ఆలోచనా ధోరణిని అర్థం చేసుకొని దానిపై పనిచేయాలి. అతడిపై ఒత్తిడి చేస్తే అత్యుత్తమ ఫలితాలు రావు. నిజమే, అతడికి చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ అతడి నుంచి అత్యుత్తమ ఆటను తీసుకురావడం ఎలా? జట్టులో అతడిని పర్యవేక్షిస్తున్న కోచ్‌లు, సారథి ఎంతో మార్పు తేవొచ్చు’ అని యువీ అన్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ఎంఎస్ ధోనీ వీడ్కోలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా గౌరవించాలని వెల్లడించాడు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
