close

తాజా వార్తలు

గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. ఇద్దరి మృతి

చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఓ ఇంట్లో పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానిక ఎన్టీఆర్‌ కాలనీలో నివాసముండే నాగార్జున ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఇంట్లో ఉన్న దివ్య. విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో నాగార్జున తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. నాలుగేళ్ల శృతి, 70 ఏళ్ల గురుస్వామికి స్వల్పగాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లో టపాసులు తయారు చేస్తుండగా పేలుడు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.