close

తాజా వార్తలు

నేనూ మీడియాలోనే చూశా: శక్తికాంతదాస్‌

ముంబయి: రెవెన్యూ లోటు భర్తీకి రూ.30వేల కోట్లు మధ్యంతర డివిడెండ్‌ను కేంద్రం ఆర్‌బీఐని కోరవచ్చని వస్తున్న వార్తలపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పందించారు. తాను కూడా ఈ విషయాన్ని మీడియాలోనే చూశానని వ్యాఖ్యానించారు. డివిడెండ్‌ కోరుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి డిమాండ్‌ వచ్చినట్లు తనకై తెలీదన్నారు. నాలుగో ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రకటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇటీవల పన్నుల్లో భారీ స్థాయిలో కోత విధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయానికి లోటు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో రూ.30వేల కోట్ల మేర మధ్యంతర డివిడెండ్‌ కోరవచ్చని వార్తలు వచ్చాయి. కాగా, ఇటీవలే రూ.1.76 లక్షల కోట్లు మిగుల నిధులను కేంద్రానికి ఇచ్చేందుకు ఆర్‌బీఐ బోర్డు ఆమోదం తెలిపింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.