
తాజా వార్తలు
కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు
చామరాజనగర, న్యూస్టుడే: కర్ణాటకలోని బండీపుర అభయారణ్యం అంచుల్లోని గ్రామాల్లో ఓ పులి సంచారం గ్రామస్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మంగళవారం చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా చౌడహళ్లి సమీపాన మూర్కల్లు గుట్టలపై పశువుల్ని మేపడానికి వెళ్లిన రైతు శివలింగప్పపై పులి దాడిచేసి హతమార్చింది. ఇదే పులి బుధవారం ఓ ఆవును చంపింది. దీంతో ఆ పులి కనిపిస్తే కాల్చివేయాలని కర్ణాటక అటవీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Tags :