close

తాజా వార్తలు

అశ్విన్‌ జోరు: సఫారీసేన 275 ఆలౌట్‌

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం

పుణె: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 275 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమ్‌ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 36/3తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సఫారీసేన 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన క్వింటన్‌ డికాక్‌ (31)తో కలిసి దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ (64; 117 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కానీ, వీరిద్దరినీ అశ్విన్‌ పెవిలియన్‌కు పంపించడంతో సఫారీసేన మరోసారి కష్టాల్లో పడింది. కానీ, కేశవ్‌ మహారాజ్‌ (72; 128 బంతుల్లో 12 ఫోర్లు), ఫిలాండర్‌ (44*; 177 బంతుల్లో 6 ఫోర్లు) అద్భుతంగా పోరాడారు. వీరిద్దరూ కలిసి తొమ్మిదో వికెట్‌కు శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మహారాజ్‌ను అశ్విన్‌ బోల్తా కొట్టించడంతో 109 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది. మూడో రోజు ఆఖరి ఓవర్లో రబాడ (2)ను కూడా అశ్విన్‌ పెవిలియన్‌కు పంపించడంతో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో అశ్విన్‌ (4/69), ఉమేశ్‌ యాదవ్‌ (3/37) రాణించారు.

* ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన అశ్విన్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై 50 వికెట్లు సాధించిన భారత నాలుగో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతడి కన్నా ముందు అనిల్‌ కుంబ్లే (84), శ్రీనాథ్‌ (64), హర్భజన్‌ సింగ్ (60) ఉన్నారు. 

* తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన భారత్‌కు.. సఫారీలపై ఇది రెండో అత్యధిక ఆధిక్యం. 2009/10లో కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో టీమ్‌ఇండియాకు లభించిన 347 పరుగులే అత్యధికం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.