
తాజా వార్తలు
రెండో త్రైమాసికం ఫలితాలు ప్రకటించిన సాఫ్ట్వేర్ దిగ్గజం
ముంబయి: దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో రెండో త్రైమాసికం ఫలితాలను మంగళవారం వెల్లడించింది. సంస్థ నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే 35.1శాతం వృద్ధి సాధించి రూ.2,552.6గా నమోదైంది. ‘‘కాన్స్టాంట్ కరెన్సీ లెక్కల ప్రకారం ఆదాయంలో 1.1శాతం వృద్ధి సాధించాము. సీసీ ఆధారంగా గత ఏడాదితో పోలిస్తే 3.8శాతం వృద్ధి సాధించాము.’’ అని విప్రో ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ సమయంలో స్థూల ఆదాయం 4శాతం పెరిగి రూ.15,130 కోట్లుగా నమోదైంది. ఈపీఎస్ రూ.4.3గా ఉందని కంపెనీ పేర్కొంది. ‘‘ఈ త్రైమాసికంలో లాభాలు, ఆదాయం బాగున్నాయి. ఈ కాలంలో ఒక భారీ డీల్‌పై సంతకాలు చేశాము.’’ కంపెనీ సీఈవో ఎండీ ఎ.జెడ్.నిమ్చువాలా తెలిపారు.
ఈ సారి విప్రో ఆపరేటింగ్ మార్జిన్లు గత ఏడాదితో పోలిస్తే 3.1శాతం పెరిగి 18.1శాతంగా నమోదయ్యాయి. కాకపోతే గత త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 0.3శాతం తక్కువ.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- విచారణ ‘దిశ’గా...
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- కొడితే.. సిరీస్ పడాలి
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
